రోడ్డు ప్రమాదాల నివారణకు అందరు తోడ్పడాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రోడ్డు ప్రమాదాల నివారణకు అందరు తోడ్పడాలి
– 24వ వార్డులో ఉత్సహాంగా అరైవ్ – అలైవ్ ప్రోగ్రాం
– పాల్గొన్న కౌన్సిలర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ పోలీసు బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్‌లు అన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 90 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 24వ వార్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ఉత్సహాంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పోలీసు బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష కుమార్‌లు హాజరై రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ కృషి చేస్తుందని అన్నారు. అవగాహన లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కావున ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్, అంగన్వాడీ టీచర్లు, అర్పిలు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ మహిళ సబ్ కోటాకు ఉద్యమించండి