తాండూరు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్తం ఎన్నిక

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్తం ఎన్నిక
– అధ్యక్షులుగా అగ్గనూర్ శ్రీనివాస్, కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి
– ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు న్యాయస్థానం బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యింది. గురువారం ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా అగ్గనూర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండప్ప, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి(ఐనెల్లి), సంయుక్త కార్యదర్శిగా ఎండీ ఫరీద్, కోశాధికారిగా బి.రవికుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా రామ్మోహన్, ఆంజనేయులు, కలాం, మహిళ ప్రతినిధిగా సోఫియా భేగంలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరులో సబ్ కోర్టు, బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పలువురు న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఇదికూడా చదవండి..

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు