రైల్వే ఫ్లై ఓవర్ లాస్.. అండర్ బ్రిడ్జి బెస్ట్..!
– తాండూరు బ్రిడ్జి నిర్మాణంపై కొండా అభిప్రాయం
– దక్షణ రైల్వే జీఎంకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం లాస్ ఏర్పడుతుందని, దాని స్థానంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తే అందరికి ఉపయోగకంగా ఉంటుందని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను కోరారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే శాఖ జీఎం అరుణ్ కుమార్ జైన్, డిప్యూటీ జీఎం శ్రీధర్ లను రైల్వే జీఎంలకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో సుమారు రూ.74 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణానికి అధిక వ్యయంతో పాటు స్థానికులకు ఆస్తినష్టం జరిగే అవకాశం ఉందని లేఖలో అభిప్రాయపడ్డారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల దాదాపు 200 ఇళ్లు కోల్పోవచ్చని, స్థానికులకు తీవ్ర ఆస్తినష్టం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మార్పులు చేయాలన్నారు. దాని స్థానంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యయం తగ్గడంతో పాటు స్థానికులకు ఆస్తి నష్టం వాటిళ్లదని అన్నారు.
మరోవైపు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని నావంద్గి రైల్వే స్టేషన్ లో హైదరాబాద్ ఎక్స్ ప్రెస్(17319, 17320), రాయలసీమ ఎక్స్ ప్రెస్ (12793)లను హాల్ట్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై జీఎం. డీజీఎంలు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
ఇదికూడా చదవండి…

