రేపు తాండూరుకు రాజాసింగ్ రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు రాజాసింగ్ రాక
– బహిరంగ సభకు ముఖ్య అథితిగా హాజరు
– పాల్గొంటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరుకు హైదరాబాద్‌ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు బుధవారం తాండూరులో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. కావున పార్టీ నేతలు, కార్యకర్తలు, బూతు స్థాయి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో జింక మాంసం..!