రోహిత్ రెడ్డికి జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డికి జై..!
– బీఆర్ఎస్‌లో చేరిన చెంగోల్ గ్రామస్తులు
– ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన పైలెట్ రోహిత్ రెడ్డికే జై కొడతామని తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన మహిళలు, యువకులు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన దాదాపు 250 మంది మహిళలు, యువకులు, ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా అందరు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. అనంతరం రాకేష్ గౌడ్ తోపాటు కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవడంతో పాటు భారీ మెజార్టీ అందించేలా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పటేల్ ఉమాశంకర్, అంతారం సర్పంచ్ రాములు, చెంగోల్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!