ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలి..!
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– యాడీ బాపు గాడ్ దేవస్థానంకు చేయూత
– రూ. 1లక్ష 40వేలతో తాగునీటి బోరు మోటారు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ సమీపంలో వెలసిన యాడి బాపు గాఢ్ దేవస్థానంలో తాగునీటి కోసం విఠల్ యక్ రూ.లక్ష 14 వేల రూపాయలతో బోరు మోటర్ వేయించి భక్తులకు, ప్రయాణికులకు తాగునీటిని అందించి దాహార్తిని తీర్చేందుకు చేయూతను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవం నుంచి దైవ మార్గంలో వెళ్తున్న మిత్రుడు సురేందర్ రాథోడ్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక యాడి బాపు గాడు దేవస్థానంలో పూజారిగా దేవుని సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. నిస్వార్ధంగా, డబ్బులకు ఆశపడకుండా భక్తులకు సేవ చేయడం ఆయన వల్లనే అవుతుందని విట్టల్ నాయక్ కొనియాడారు.

అదేవిధంగా సురేందర్ రాథోడ్ దంపతులు మాట్లాడుతూ మా కోరిక మేరకు అడిగిన వెంటనే తాగునీటి కోసం రూ.1ల 14 వేలతో బోర్ వేయించి, మోటర్ ను ఏర్పాటు చేసి తాగునీటిని అందించిన గొప్ప నాయకుడని, దేవుడు ఆయనను చల్లంగా చూడాలని అష్టైశ్వర్యాలతో జీవించాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యాడి బాపు ఘాడ్ వ్యవస్థాపకులు, పూజారులు సురేందర్ రాథోడ్, శాంతి దేవి, భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

