గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
– శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నిఘా ఉంచి పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే గణేష్ పండుగ సందర్భంగా సోమవారం సీఐ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. పట్టణంలోని పురవీదుల్లో.. వివిధ కాలనీలలో ఈ కవాతు కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి, నిమజ్జన ఉత్సవాలలో భాగంగా ఆర్ఏఎఫ్, సీఆర్పీఎప్ సిబ్బంది ద్వారా తాండూరులో పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమజ్జన ఉత్సవాలు ముగిసే వారకు ఈ సిబ్బంది తాండూరులోనే ఉంటారని స్పష్టం చేశారు. కావున అందరూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండగను జరుపుకోవాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
