వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ

కెరీర్ తాండూరు తెలంగాణ వికారాబాద్

chai jrవికారాబాద్‌ జిల్లా కలెక్టర్ బదిలీ
– కొత్త కలెక్టర్‌గా ప్రతీక్ జైన్
– అడిషనల్‌ కలెక్టర్‌కు కూడా స్థానచలనం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్ రాహుల్‌ శర్మకు స్థాన చలనం కల్పించారు. గత యేడాది వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను నల్గొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో భద్రాచలం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌ శర్మకు కూడా ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


తెలంగాణలో బదిలీ అయిన కలెక్టర్లు వీరే
ఖమ్మం: ముజామిల్‌ ఖాన్‌
నాగర్‌కర్నూల్‌: సంతోష్‌
భూపాలపల్లి: రాహుల్‌శర్మ
కరీంనగర్‌: అనురాగ్‌ జయంతి
పెద్దపల్లి: కోయ శ్రీహర్ష
జగిత్యాల: సత్యప్రసాద్‌
మంచిర్యాల: కుమార్‌ దీపక్‌
మహబూబ్‌నగర్‌: విజయేంద్ర
హనుమకొండ: ప్రావిణ్య
నారాయణపేట్‌: సిత్తా పట్నాయక్‌
సిరిసిల్ల: సందీప్‌కుమార్‌ ఝా
భద్రాద్రి కొత్తగూడెం: జతీష్‌ బీ పాటిల్‌
వికారాబాద్‌: ప్రతీక్‌ జైన్‌

రేషన్‌ ఈకేవైసీకి మరో చాన్స్..!