తెదేపా పూర్వవైభవానికి కృషి
– తాండూరు కోఆర్డినేటర్ గా సూరజ్ సింగ్ ఠాకూర్
– కాసాని జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా నియామకపత్రం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు దేశం పార్టీ తాండూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సూరజ్ సింగ్ ఠాకూర్ నియామకం అయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేతుల మీదుగా ఆయన నియామకం పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సూరజ్ ఠాకూర్ మాట్లాడుతూ తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు అందరితో కలిసి తెదేపా పూర్వవైభవానికి కృషి చేస్తానని అన్నారు.
ఇది కూడా చదవండి…


