మొలకెత్తిన గోధుమలలో ఆరోగ్యం మెండు
– డయాబెటిస్ వారికి సూపర్ ఫుడ్
– ఎముకల బలానికి దోహదం
దర్శిని డెస్క్ : మొలకెత్తిన ఆహార దినుసులలో ఆరోగ్య రహాస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల మనిషి పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందుతాడు. మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మొలకెత్తిన గోధుమలు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మొలకెత్తిన గోధుమలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, B, C, E మొలకెత్తిన గోధుమలలో లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

పోషకాలు పుష్కలం: మొలకెత్తిన గోధమలలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మన డైట్లో మొలకెత్తిన గోధుమలను ఎదోవిధంగా చేర్చుకునేలా చూడండి.
డయాబెటిస్ వారికి సూపర్ ఫుడ్ : డయాబెటిక్ రోగులకు, మొలకెత్తిన గోధుమలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిక్ రోగులకు సూపర్ ఫుడ్ అని చెబుతారు. అలాగే, మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ జింక్ లభిస్తాయి. పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీ, ఇ కూడా పుష్కలం.
ఎముకలకు బలం: మొలకెత్తిన గోధుమలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొలకెత్తిన గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా మారతాయి.

అధిక బరువును నియంత్రణ : మొలకెత్తిన గోధుమలు మీ రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే.. ఎక్కువ సమయంపాటు మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మొలకెత్తిన గోధుమలను తినడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇదికూడా చదవండి…

