అబ్బాయితో అబ్బాయి పెళ్లి
– త్వరలో ఒక్కటి కాబోతున్న జంట
– హైదరాబాద్‌లో వివాహా వేదిక
– తెలంగాణ రాష్ట్రంలో మొదటి వివాహము
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: సాధారణంగా అమ్మాయి.. అబ్బాయితో పెండ్లిళ్లు జరుగుతాయి. కొంచెం వింతగా ఉన్న వయస్సులో ఉన్న అమ్మాయితో వయసయిన వారి పెండ్లిళ్లు జరుగుతాయి. ఇక విదేశాల్లో అబ్బాయి.. అబ్బాయి పెండ్లిళ్లు జరుగుతుంటాయి. అలాంటి వింత పెండ్లి మన తెలంగాణలో మొదటిసారి జరగబోతుంది. ఇందుకు హైదరాబాద్ మహానగరంలోని ఓ వివాహా వేదికపై తొలి సారి అబ్బాయితో అబ్బాయి పెండ్లి జరగబోతోంది. పెండ్లితో ఒక్కటి కాబొతున్న జంట హైదరాబాద్‌కు చెందిన వారు కావడం విశేషం. హైదరాబాద్ కి చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు యువకులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. 2013 లో ఒక డేటింగ్ యాప్ వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మనసులోని భావాలు కలవడంతో వారి మధ్య స్నేహం కుదిరింది. అనంతరం అది ప్రేమగా మారి ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వారీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటంబాల పెద్దల్ని కలిసి పెళ్లి చేసుకుంటామని చెప్పేశారు. ఇందుకు వారు కూడ పచ్చజెండా ఊపడంతో త్వరలో దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. పెద్దల గురించే భయముండేదని.. ఇప్పుడు వారిని ఒప్పించడంతో ఆనందాలకు అవధులు లేవని వారు చెబుతున్నారు. అందరి పెళ్లిళ్లు లానే తమ వివాహంలోనూ మంగళ స్నానాలు, నిశ్చితార్థం, సంగీత్, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాలు ఉంటాయని ఈ ప్రేమ జంట వెల్లడించారు. వచ్చే డిసెంబర్ మాసంలో వీరి వివాహం జరగనుంది. ఇక ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం తెలంగాణలో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
