
చిన్నారి చదువుకు చేయూత..!
– స్కూల్ కు ఏడాది ఫీజు చెల్లింపు
– ఆర్యవైశ్య, వైశ్య ఫెడరేషన్ ఉదారత
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదరికంలో ఉన్న ఓ చిన్నారి చదువుకు తాండూరు ఆర్యవైశ్య సంఘం, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేయూతను అందించింది. పట్టణంలో విజయ విద్యాలయ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో ఆర్యవైశ్య సంఘంకు చెందిన కందూరి వినోద్ కూతురు చదువుతుంది. చిన్నారి ఫీజు చెల్లింపుకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విషయం ఆర్యవైశ్య, వైశ్య ఫెడరేషన్ దృష్టికి వచ్చింది.
సంఘం కార్యదర్శి కోడూరి వినోద్ కుమార్, కోశాదికారి రొంపల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు ఆకారం శివకుమార్ ల చొరవతో సంఘానికి చెందిన కల్వ ఉమాశంకర్ ఆయన కూతురు జన్మదినం సందర్భంగా అందించిన సహకారంతో చిన్నారి స్కూల్ ఫీజు చెల్లించారు. గురువారం స్కూల్ ప్రిన్సిపల్ ను కలిసి సంవత్సరం ఫీజు మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘాల తరుపున ఆర్యవైశ్యులతో పాటు పేదలకు సహకారం అందిస్తామన్నారు. మరోవైపు చిన్నారి సంవత్సరం ఫీజు చెల్లించడం పట్ల తండ్రి సంఘ నాయకులకు ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శరత్కల, సంఘం కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
ఇదికూడా చదవండి….

