హత్య‌కేసు నిందితుడిపై రౌడీషీట్

క్రైం తాండూరు వికారాబాద్

హత్య‌కేసు నిందితుడిపై రౌడీషీట్
– మరో ఐదుమందిపై స‌స్పెక్ట్ షీట్
– వెల్ల‌డించిన రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి
తాండూరు రూర‌ల్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పాత నేరుస్తుడు, హ‌త్య కేసులో నిందితుడిపై రౌడీషీట్, ఇత‌ర కేసుల్లో నిందితుల‌పై స‌స్పెక్ట్ షీట్ తెర‌వ‌డం జ‌రిగింద‌ని తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తాండూరు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బ‌షీరాబాద్ పోలీస్టేష‌న్‌లో మండ‌లంలోని ఎక్మాయి గ్రామంలో జ‌రిగిన హ‌త్య కేసులో నిందితుడుగా ఉన్న బోయిని నాగ‌ప్పపై రౌడీ షీట్ తెర‌వ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఇత‌ను ప‌లు కేసుల‌లో కూడ నిందితుడుగా ఉన్నాడ‌ని గుర్తుచేశారు. అదేవిధంగా బ‌షీరాబాద్ మండ‌లంలోని కోర్విచేడ్ గ్రామానికి చెందిన త‌లారి మ‌ధు, గౌడి మ‌ల్ల‌ప్ప‌, మాల అంబ‌దాస్, అదే మండలం మంత‌న్‌గౌడ్ తాండాకు చెందిన విజ‌య్ కుమార్, త‌లారీ మ‌ధులు ప‌లు కేసుల్లో నిందితులుగా ఉన్నందున వారిపై స‌స్పెక్ట్ షీట్ తెర‌వ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో అడ్డంకులు సృష్టిస్తున్నందున రౌడీ షీట్, స‌స్పెట్ షీట్‌లు తెర‌వ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. వీరిపై నిరంత‌ర నిఘా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.