తాండూరు మాజీ జెడ్పీటీసీ కన్నుమూత
– అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సుందర్ రాజ్
– విచారం వ్యక్తం చేసిన పలువురు నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల మాజీ జెడ్పీటీసీ సుందర్ రాజ్ కన్నుమూశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆరోగ్య పరిస్థితి క్షీణిచడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే సుందర్ రాజ్ తెలంగాణ ఏర్పాటుకు ముందు టీడీపీ హాయాంలో తాండూరు జెడ్పీటీసీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మంత్రి మహేందర్ రెడ్డితో పాటు సుందర్ రాజ్ కూడ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. తాజాగా ఆయన కన్నుమూయడంతో మంత్రి మహేందర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి…

