అయ్యో పాపం అమ్మాయిలు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
అయ్యో పాపం అమ్మాయిలు..!
– క్లాస్‌రూంలో బేంచీలు మోసిన విద్యార్థినిలు
– తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఘటన
– ప్రిన్సిపల్‌, సిబ్బందిపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు కష్టపడి చదువుకోవాలని అంటుంటారు. కాని తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది. గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే రూ. 2 కోట్లతో అదనపు గదుల భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రారంభం మరుసటి రోజు నుంచి కాలేజీలో కష్టాలు తిష్టవేశాయి.

భవనం ప్రారంభమైన తరువాత గదులకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులోనే చదువుకోవాల్సి వచ్చింది. గదులు తెరుచుకున్న కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గదులైతే ఉన్నాయి కాని అందులో కూర్చునేందుకు బేంచీలు ఏర్పాటు చేయలేదు. నేడు చేస్తారు.. రేపు చేస్తారు అనుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు.

బరువైనా మోసుకుంటూ వెళ్లి తరగతి గదిలో వేశారు. కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించడం పట్ల ప్రిన్సిపల్‌తో పాటు అద్యాపక సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్దంగా కాలేజీ అమ్మాయిలతో బేంచీలను మోయించడం చర్చనీయాంశమైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు తమంతటా తామే బేంచీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పినట్లు ప్రిన్సిపల్‌ చెప్పడం గమనార్హం.

ఇదికూడ చదవండి…

మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ