నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..!
– ఉధృతి పోటుకు కుప్ప కూలిన గుట్టలు
– ముందే బయట పడిన కార్మికులు
– మల్కాపూర్‌ గనుల్లో సంఘటన
తాండూరు రూరల్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాండూరు మండలంలోని నాపరాతి గనులను దంచికొట్టిన వాన ముంచెత్తింది. వాన నీటి ఉధృతికి బండల్లాంటి గని గుట్టలు కొట్టుకుపోయాయి.. పేరుకుపోయిన నాపరాతి వ్యర్థాలు కూలి పోయాయి. ప్రమాదాన్ని ముంచే గమనించిన కార్మికులు బయట పడ్డారు. స్థానికులు సెల్‌ ఫోన్లో చిత్రీకరించిన చిత్రాలు స్థానికంగా వైరల్‌గా మారాయి. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామ సమీపంలోని సర్వేనెంబర్ 23లోని గని భూముల్లో కొందరు తవ్వకాలు చేపడుతున్నారు.

చాలా కాలంగా ఉన్న నాపరాతి వ్యర్థాలు గుట్టలా పేరుకుపోయాయి. అదేవిధంగా గనుల్లో తొలగించిన నాపరాతి గోడలు ఉండిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షాలకు వరధ నీరు పొటెత్తింది. పనులకు వచ్చిన కార్మికులు ముందే ప్రమాదాన్ని అంచన వేసి గనుల్లో నుంచి బయటకు వచ్చేశారు. కొద్ది సేపటికే వరధ పోటుతో గనికి సమీపంలో ఉన్న వ్యర్థాల గుట్ట కుప్ప కూలి పోయింది. అ వేంటనే గని గోడలు కొట్టుకుపోయాయి. ముందే కార్మికులు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. అదే రోజు ఓ లారీలో నాపరాతిని లోడ్ చేయాల్సి ఉండిందని, వర్షం కారణంగా రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నామని కార్మికులు తెలిపారు. అంతకుముందే బయటకు వచ్చిన కార్మికులు వరధ ప్రమాదాన్ని వారి సెల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. సోమవారం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి.

ఇదికూడ చదవండి….

సేవకు మారుపేరు లయన్స్ క్లబ్