వీరశైవులకు సర్కారు ప్రత్యేక గుర్తింపు
– రూ.10కోట్లతో బసవ భవన్ ఏర్పాటు
– 2న జరిగే భూమిపూజను జయప్రదం చేయాలి
-లింగాయత్‌లను ఓబీసీలో చేర్చేందుకు కృషి
– జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత వీరశైవ లింగాయత్ లకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని బసవ సంఘాల సమన్వయ కమిటి చైర్మన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం ఆధ్వర్యంలో భద్రేశ్వర ఆలయంలో సమాజం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ బీబీ పాటిల్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు చరిత్రలో నిలిచిపోయేలా ట్యాంక్ బండ్ పై బసవేశ్వరుని విగ్రహ ఏర్పాటు ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో రూ. 10 కోట్లతో ఎకరా స్థలంలో బసవ భవన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చేనెల అక్టోబర్ 2న రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో నిర్వహించే బసవ భవన్ భూమిపూజకు తాండూరు నుంచి భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎంపీ బీబీ పాటిల్ తో పాటు బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్సీబీసీ, సోషల్ జస్టిస్ మినిస్టరీలకు నివేధికలను అందించడం జరిగిందని గుర్తుచేశారు. త్వరలోనే వీరశైవులను ఓబీసీలుగా గుర్తించేందుకు తమవంతు కృషి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం బసవ భవన్ భూమిపూజకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అంతకుముందే వీరశైవ, వీరశైవ యువదళ్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్, బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పెద్దలు హేరూర్ విజయ్ కుమార్, ఉమాకాంత్ పాటిల్, శివశరణప్ప, సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ బంటారం లావణ్య, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, తాండూరు వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి గాజుల శాంతుకుమార్, మాజీ అధ్యక్షులు వాలి శాంతుకుమార్, తంబాకు చంద్రశేఖర్, అగ్గనూర్ జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులు ప్రకాష్, నాగభూషణం, పటేల్ విజయ్ కుమార్, సభ్యులు కోర్వార్ నగేష్, బంటారం భద్రేశ్వర్, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్ కుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

