శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీలు

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీలు
– పూజ‌లు నిర్వ‌హించిన మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజు
ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజులు తిరుప‌తిలో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలుగా రెండవ సారి ఏకగ్రీవంగా గెలిచిన సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మ‌హేంద‌ర్ రెడ్డి, శంబీపూర్ రాజులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద, పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాలరెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్, ప్రేమ్ కుమార్‌,  తాండూరు టిఆర్ఎస్ నాయకుుులు తాటికొండ పరిమళ్ గుప్తా స్వామి వారిని దర్శించుకున్నారు.