మున్సిపల్‌లో 30 మీటర్ల ఎత్తైన జెండా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్‌లో 30 మీటర్ల ఎత్తైన జెండా..!
– స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ
– హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాల్టీ సరికొత్త ఆవిష్కరణకు సిద్దమైంది. కొత్త మున్సిపల్ కార్యాలయంలో 30 మీటర్లు అంటే 100 ఫీట్ల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర దినొత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముస్తాబు చేశారు. కొన్ని నెలల క్రితమే మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణకు స్థూపం సిద్దం చేశారు. పనులు పూర్తయనప్పటికి సరైన సందర్భం కోసం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.

గురువారం కార్యాలయంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తెలిపారు. ఆ కార్యక్రమానికి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌లు హాజరవుతారని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవంను జయప్రదయం చేయాలని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు.

ఇదికూడా చదవండి…

ఖర్జూరాలు రోగాల ఫైటర్..!