ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ
– దేశాభివృద్ధిలో ఎన్నో మార్పులు ఆయన ఘనతే
– తాండూరులో వర్ధంతిలో నాయకుల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో ఎన్నో మార్పులు తీసుకవచ్చి.. ఆధునిక భారత నిర్మాణానికి అడుగులు వేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తాండూరు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.

గురువారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలొని రాజీవ్ కాలనీ వద్ద రాజీవ్ గాంధీ వర్దంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు మల్లన్న, అఫ్పూ(నయూం) తదితరులు హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ… దేశానికి కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసిన దార్శనికుడు అని అన్నారు. 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించిన మహానేతగా అభివర్ణించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లుపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాతుల వెంకటేష్, కొర్ర నాగేష్, లింగదల్లి రవి, గోపాల్, పార్టీ అధికార ప్రతినిధి వడ్డే శ్రీనివాస్, జిలానీ, వెంకన్న, మండపతి శివకుమార్, కిష్టప్ప, అఖిల్ బాబా, కో-ఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక