వైభవంగా శ్రావణమాస భజన ముగింపు కార్యక్రమం

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా శ్రావణమాస భజన ముగింపు కార్యక్రమం
– మార్మోగిన కందనెల్లి అభయాంజనేయ స్వామి దేవాలయం
పెద్దెముల్, దర్శిని ప్రతినిధి : శ్రావణమాసం భజన కార్యక్రమం ముగింపు సందర్భంగా తాండూరు రాజీవ్ గృహకల్ప శ్రీ భవాని మాత మహిళా భక్త బృందం, వికారాబాద్ గంగవరం సద్గురు భజన మండలి ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం కందనెల్లిలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో భజన కీర్తనలు ఆలపించారు. శ్రావణమాసం నెలరోజులపాటు భక్తి కీర్తనలు ఆలపించి సోమవారం అమావాస్య సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన భజన తెల్లవారుజామున ఆరున్నర గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. తెల్లవారుజామున ఆంజనేయస్వామి, శివాలయం లో పూజలు, గంగపూజ అనంతరం శ్రావణమాస భజన కార్యక్రమం ముగించారు. కార్యక్రమంలో కందనెల్లి ఆంజనేయ భజన భక్త బృందం సభ్యులు యువకులు పాల్గొన్నారు. అంపెలి పురుషోత్తమ్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

వానల ముప్పుతో జర పైలం