పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి
– సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లా అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని అభ్యర్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంతో డీఎడ్ 2007, 2009, 2008 అభ్యర్థులకు పాత నోటిఫికేషన్లో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం అభ్యర్థుల వివరాలను విచారణ చేసిందన్నారు. డీఎస్సీలో అవకాశం కల్పించకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పరీక్షలు కూడా రాశామని తెలిపారు.
కోర్టు ద్వారా సెలక్షన్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో అన్యాయం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో పాత డీఎస్సీ, డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అభ్యర్థులు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అభ్యర్థులు రఘు, రాంప్రసాద్, కిషోర్, రవి, శ్రీనివాస్, సునీత, కరుణాకరన్, అనంత లక్ష్మీ, లత తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

