ఇదెక్కడి వింతరా బాబూ..!
– బైకుకు హ్యాపీ బర్త్ డే
– కత్తి కట్టీ మరీ కేక్ కటింగ్
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్ : మనషనులు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం సాధారణం. పెంపుడు జంతువులు కుక్కలు, ఆవులు, ఇతర మూగ జీవాలకు, చెట్లుకు పుట్టిన రోజు నిర్వహించడం కూడా సహజంగా మారింది. పిచ్చి పీక్స్.. వెళ్లిందనేంతలా ఓ వ్యక్తి తన బైకుకు బర్త్ డే వేడకలు నిర్వహించాడు. దానిని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శివమూర్తి3893 అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి ఓ రేంజ్లో వ్యూస్ వస్తున్నాయి.
ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్‌గా మారింది. అందుకోసం ఆ వ్యక్తి.. బైక్ నీట్‌గా కడిగి ఓ పూల దండ వేశాడు. ఇంట్లో వాళ్లని.. ఇరుగు పొరుగు వారిని బైక్ బర్త్ డే వేడుకకు పిలిచాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి బైక్ ముందు కేక్ పట్టుకోగా.. మరో వ్యక్తి.. ముందు టైర్‌కు కత్తి కట్టి ముందుకు నడిపించాడు.
https://www.instagram.com/reel/C-uvOEANvNX/?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా పలువురు నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు. “పెట్రోల్ ట్యాంక్ తెరిచి అందులో కొవ్వొత్తి వెలిగించండి” అని, “కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుకున్న బైక్‌పై ఆ మాత్రం ప్రేమ ఉంటుంది” అని, “మగవాళ్లు సరిగ్గా ప్రేమించలేరు అని ఆడోళ్లు అంటుంటారు.. అలాంటివారు ఈ వీడియో చూడండి” అని మరో యూజర్ పేర్కొన్నాడు.
ఇదికూడా చదవండి..

