తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం
– బదీలీల ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కలిగింది. భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు నియమితులయ్యారు. బదిలీ అయిన ఐఏఎస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..

టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్‌
మంద మకరందు – సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌
జెడ్‌.కె. హనుమంతులు – పర్యాటకశాఖ డైరెక్టర్‌
దేవాదాయశాఖ సంచాలకులుగా జెడ్‌.కె. హనుమంతులకు అదనపు బాధ్యతలు
శశాంక- రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‌
ఎస్‌.హరీశ్‌ – ఐ అండ్‌ పీఆర్‌ ప్రత్యేక కమిషనర్‌
హరీశ్‌కు విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
వినయ్‌కృష్ణారెడ్డి – ఆర్‌ అండ్‌ ఆర్‌ భూసేకరణ కమిషనర్‌
ఆయేషా మస్రత్‌ – వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి
వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్‌ చక్రవర్తికి అదనపు బాధ్యతలు
కె. చంద్రశేఖర్‌రెడ్డి – డెయిరీ కార్పొరేషన్‌ ఎండీ
ఎస్‌. దిలీప్‌కుమార్‌ – నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌
సోని బాలదేవి – క్రీడాశాఖ సంచాలకులు (అదనపు బాధ్యతలు)
కొర్రా లక్ష్మి – రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీ
స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మికి అదనపు బాధ్యతలు
ఎన్‌. క్షితిజ – ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ
సుభద్రా దేవి – జీహెచ్‌ఎంసీ అర్బన్‌ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌
జి.జ్ఞానేశ్వర్‌ – వికారాబాద్‌ డీఎఫ్‌ఓ

ఇదికూడా చదవండి…

అయ్యో.. పాపం కూలీ..!