టీఆర్‌ఎస్‌ను దెబ్బ‌కొట్టిన మ‌రో గుర్తు

తెలంగాణ రాజకీయం హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ను దెబ్బ‌కొట్టిన మ‌రో గుర్తు
– రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన ఓ గుర్తు దెబ్బ‌తీస్తోంది. కారు గుర్తును పోలిన రోటీ మేకర్‌ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు కేటాయించింది ఈసీ. కాంగ్రెస్ కంటే ఈ గుర్తుకే ఎక్కువ ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఫస్ట్ రౌండ్‌లోనే ఇన్ని ఓట్లు పోలయ్యాయి. అన్ని రౌండ్స్ ముగిసేసరికి ఈ గుర్తుకు పోలయిన ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్లలో 344 ఓట్ల లీడ్ సాధించింది టీఆర్‌ఎస్‌. అయితే తొలి రౌండ్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యం కనబరిచింది బీజేపీ. అయితే అధికార టీఆర్‌ఎస్‌కు ఇండిపెండెంట్స్ వల్ల మరోసారి ఇబ్బంది ఎదురైనట్లు స్పష్టమవుతోంది.

ఫస్ట్ రౌండ్‌లో పోలైన ఓట్లు ఇవే..