సేవలో లయన్స్ క్లబ్ దూకుడు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సేవలో లయన్స్ క్లబ్ దూకుడు..!
– రెసిడెన్షియల్ స్కూల్కు వాటర్ మిషన్ వితరణ
– విద్యార్థుల చేయూతకు ముందుంటాం
– తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవలో ముందు ఉండే తాండూరు లయన్స్ క్లబ్ దూకుడు పెంచింది. లయన్స్ క్లబ్ 50 గొల్డెన్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటైన కార్యవర్గం వివిధ సేవా కార్యక్రమాలతో దూసుకపోతున్నారు. పెద్దల సహాకారంతో అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు చేయూతను అందించారు.

లయన్స్ క్లబ్ తరుపున సభ్యులు గౌరీ శంకర్ సహాకారంతో విద్యార్థుల కోసం కూల్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సర్ ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడే లయన్స్ క్లబ్ ధ్యేయమని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడు ముందు ఉంటుందని అన్నారు. విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్  ప్రవీణ, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎడ్రామి బసన్నప్ప, కార్యదర్శి గాజుల వీరప్రసాద్, కోశాధికారి అసద్ అలీ, గూళి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ