చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలి
– పీపుల్స్ కాలేజీ సెక్రటరీ పి.ఉత్తమ్ చంద్
– ఉత్సహాంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలని తాండూరు పీపుల్స్ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ పి.ఉత్తమ్ చంద్ అన్నారు. మంగళవారం కళాశాలలో ప్రెషర్స్ వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ పి.ఉత్తమ్ చంద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. అభిరుచి మేరకు అనుకున్నది సాధించుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మరోవైపు ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులు ఆట పాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రకళ, ఆకాడామిక్ డైరెక్టర్ సత్యానంద్, అద్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మట్టి మాఫీయాపై కొరడా..!