టమాటాతో జబ్బులకు టాటా..!
– అమృతంలా పనిచేసే జ్యూస్
– టెన్షన్, ఒత్తిడిని దూరం ఔషధం
దర్శిని డెస్క్ : మనం రోజూ తినే టమాటను చిన్నచూపు చూస్తుంటాం. కాని టమాట వల్ల రోగాలకు టాటా చెప్పే పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టమాటా జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంటున్నారు. టొమాటో రసంలో 95% నీరు ఉంటుంది. ఇది కాకుండా, ఇది విటమిన్ B6, C, పొటాషియం, మెగ్నీషియంలను కలిగి ఉంటుంది. టామాటా రసం తాగితే.. 30 రోజుల్లోనే ఎన్నో మార్పులు వస్తాయని.. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి టమోటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
టమోటా రసం పోషకమైనది.. అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. టొమాటో జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతోపాటు.. టెన్షన్, ఒత్తిడిని నిరోధిస్తుంది. టొమాటో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లైకోపీన్ ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. టొమాటో రసంలో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అంతే కాకుండా టొమాటో రసం జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
టామాట రసం తయారు విధానం
మూడు నాలుగు లేదా మీకు సరిపడినన్ని టొమాటోలను తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కోయండి. టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి.. మీకు కావాలనుకుంటే.. చిన్న అల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. మీ రుచికి తగినట్లు ఉప్పు, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోని తాగొచ్చు.ఇంకా కావాలంటే టామాటాలను ముక్కలుగా కట్ చేసి ఓ గిన్నెలో వేసి తగినంత నీరు వేసి మరగించాలి. ఆ తర్వాత మెత్తగా జ్యూస్ లా చేసుకుని తాగొచ్చు.. రుచికి తగినట్లు ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి.
ఇదికూడా చదవండి…

