ఏబీ-ఆరోగ్య మందిర్ వైద్య సేవల పురోగతికి ప్రాధాన్యం
– సీహెచ్సీలలో ప్రమాణాలు, ఖాళీల భర్తీ కోసం దృష్టి
– తాండూరులో ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన పీఆర్సీ కేరళ బృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏబీ(ఆయూష్మాన్ భారత్)- ఆరోగ్య మందిర్, సీహెచ్సీలలో సేవల పురోగతికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని కేరళ పీఆర్సీ బృందం తెలిపింది. శనివారం తాండూరుకు వచ్చిన డా. రాజేష్, డా. సురేష్ ల బృందం పట్టణంలోని చంద్రథియేటర్ సమీపంలో ఉన్న ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ (పట్టణ ఆరోగ్య కేంద్రం), గణాపూర్ వార్డులోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు.

ఆయా కేంద్రాలలో రోగులకు ఎలాంటి సేవలను అందిస్తున్నారని ఆరా తీశారు. మందుల గదులు, ఓపీ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లడుతూ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పీఆర్సీ(పాపులేషన్ రీసోర్స్ సెంటర్) బృందంగా కేరళ నుంచి ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లను సందర్శించడం జరుగుతుందన్నారు. ఆయా స్థాయిలలో రోగులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారని గుర్తించడం జరిగిందన్నారు. సీహెచ్సీ స్థాయిలో వైద్య సేవలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరముందన్నారు. ప్రసవాల కోసం గైనకాలజిస్టులు, అల్ట్రా స్కానింగ్ సేవలు, పలు విభాగాలలో సిబ్బంది భర్తి చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య విధాన పరిషత్ ద్వారా భర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ కు నివేధిక అందిస్తామన్నారు. ఆరోగ్య మందిర్ లలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిచేలా దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ డా. రవీందర్ యాదవ్, పీఆర్సీ బృందం వైద్యులు గిరిధర్, పవిత, బుచ్చిబాబు, నీరోష, రవీంద్ర, ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
వైద్య సేవలను మెరుగు పర్చండి…
పటణంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మెరుగు పరిచేలా చూడాలని మున్సిపల్ పరిధి 34వ వార్డు మాజీ కౌన్సిలర్ సోమ శేఖర్ కోరారు.

ఘనాపూర్ వార్డులోని పల్లె దవఖానను సందర్శించిన కేరళ పీఆర్సీ బృందాన్ని సోమశేఖర్ సన్మానించారు. అనంతరం పల్లె దవఖానలో సౌకర్యాల కరువు, సదుపాయాలపై వివరించారు.
ఇదికూడా చదవండి…

