సోయా మిల్క్ వేరీ హెల్త్…!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

సోయా మిల్క్ వేరీ హెల్త్…!
– శరీరంలో హిమోగ్లోబీన్ పెంపు
– చర్మానికి, ఎముకలకు అద్భుత ప్రయోజనాలు
దర్శిని డెస్క్‌: సోయా పాలు పూర్తిగా మొక్కల నుంచి లభించే ప్రోటీన్. శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఈ పాలలో ఉంటాయి. సోయా పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. సోయా పాలలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సోయా పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా సోయాబీన్ పాలు ప్రోటీన్ మంచి మూలం. ఇది మీ కండరాలకు అతి ముఖ్యమం. సోయా పాలు ప్రోటీన్ ఫైబర్ మూలం.

ఈ పాలను రోజువారీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎముకలకు మేలు చేస్తుంది. సోయా పాలలో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు మూలకాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. సోయా పాలలోని కొన్ని సమ్మేళనాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాల్షియం శాతం ఎక్కువగా ఉండే సోయా పాలను క్రమం తప్పకుండా తాగితే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీర బలహీనత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా శరీరం శక్తవంతంగా తయారవుతుంది. బరువు తగ్గాలనుకుంటే సోయాబీన్ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. సోయాబీన్ పాలు ప్రతి రోజూ తాగితే శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇందులో ఫైబర్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సోయా పాలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

సోయా మిల్క్ తాగడం వల్ల బరువు నిర్వహణ, మధుమేహం, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. అండాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పాలను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అలెర్జీ, ఇతర చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇందులో ఈస్ట్రోజెన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలో హార్మోన్లను పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి అతిగా ఈ పాలను తాగొద్దు.

ఇదికూడా చదవండి…

గర్భిణీ ఎలా మృతి చెందింది..?