పెట్రోల్ ఫ్రీ… ఎందుకంటే..!

జాతీయం తెలంగాణ

పెట్రోల్ ఫ్రీ… ఎందుకంటే..!
– ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఉచితంగా స‌ర‌ఫ‌రా
– వైర‌ల్‌గా మారిన బంక్ య‌జ‌మాని సంతోషం
ద‌ర్శిని బ్యూరో : త‌మ కుటుంబంలో ఆడ‌పిల్ల పుట్టింద‌న్న సంతోషంలో ఓ పెట్రోల్ బంకు య‌జ‌మాని చేసిన వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న బంకు వ‌ద్ద‌కు వ‌చ్చిన వారంద‌రికి పెట్రోల్‌ను ఫ్రీగా స‌ర‌ఫ‌రా చేసి వార్త‌లో నిలిచారు. ఇదివ‌ర‌కు ఒక డాక్టర్ అయితే ఏకంగా తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే.. ఫీజు కూడా తీసుకోకుండా ఉచితంగా డెయిలీవరీ చేస్తూ.. వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ఫ్యామిలీ లో ఆడపిల్ల పుట్టింద‌న్న సంతోషంలో పెట్రోల్ ఫ్రీగా స‌ర‌ఫ‌రా చేసిన య‌జ‌మానికి వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ చేసుకుందంటే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నగరంలో రాజేంద్ర సైనాని అనే వ్యక్తికీ పెట్రోల్ బంకు ఉంది. అక్టోబరు 9వతేదీన రాజేంద్ర సైనాని మేనకోడలికి ఆడపిల్ల పుట్టింది.. దీంతో రాజేంద్ర కు పట్టరాని సంతోషం కల్గింది. తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టిన సంతోషంలో రాజేంద్ర సైనాని పెట్రోల్ కోసం తన బంకు వద్దకు వచ్చిన వినియోగదారులకు రెండు రోజుల పాటు అదనంగా పెట్రోల్ ని ఉచితంగా పోయాల‌ని నిర్ణ‌యించారు. అయితే తాను చేసే పనిని మార్కెటింగ్ కోసం చేసినట్లు వినియోగదారులు, ప్రజలు భావించకూడని రాజేంద్ర భావించరాద‌నే ఉద్దేశంతో ఈ నెల 13వతేదీ నుంచి 15వతేదీ వరకు మూడు రోజుల పాటు కస్టమర్స్ కు అదనంగా పెట్రోల్ ని పోశారు. తన మేనకోడలికి కూతురు సందర్భంగా 5-10 శాతం అదనపు పెట్రోల్ ఉచితంగా తన వినియోగదారులకు అందించచనున్నాని ఒక సైన్ బోర్డ్ కూడా పెట్టాడు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం తన వినియోగదారులకు అదనపు పెట్రోల్ పంపిణీ చేశారు. రూ. 100 పెట్రోల్ పోయించుకున్న కస్టమర్లకు 5 శాతం అదనపు పెట్రోల్ ని ఇచ్చారు. ఇక రూ. 200 నుంచి రూ. 500 విలువైన పెట్రోల్ కొన్న వినియోగదారులకు 10 శాతం అదనంగా పెట్రోలు పోశారు. ప్రస్తుతం రాజేంద్ర సంతోషం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.