గర్భిణీ ఎలా మృతి చెందింది..?

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గర్భిణీ ఎలా మృతి చెందింది..?
– ప్రైవేటు ఆసుపత్రి సంఘటనపై ఆరా
– విచారణ చేపట్టిన వైద్యాధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చికిత్స కోసం వచ్చిన గర్భిణీ ఎలా మృతి చెందిందని జిల్లా వైద్యాధికారులు ప్రైవేటు ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. తాండూరు పట్టణంలోని తాండూరు నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన అక్షిత అనే గర్భిణీ మృతి చెందిన సంఘటన తెలిసిందే. కోస్గి మండలం కొత్తపల్లికి చెందిన రమేష్‌ భార్య అక్షిత(20)కు గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల సక్రమంగా లేకపోవడంతో తొలగించుకునేందుకు తాండూరు నర్సింగ్ హోం ఆసుపత్రిలో చేరింది.

ఆసుపత్రికి చెందిన వైద్యురాలు హుస్నామహమ్మద్‌ చికిత్స అందించింది. ఆదివారం సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లిన అక్షిత మృతి చెందింది. ఈ సంఘటన పత్రికల్లో రావడంతో సోమవారం వికారాబాద్‌ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓలు డా.రవీందర్, డా.జీవరాజ్‌లు తాండూరు నర్సింగ్‌ హోంను సందర్శించారు. ఆసుపత్రిలో గర్భిణీ ఎందుకు చేరింది. ఆమె మృతికి గల కారణాలను వైద్యురాలు హుస్నామహమ్మద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణ నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో లారీల బంద్..!