దుర్గమ్మా.. సల్లంగా చూడమ్మా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దుర్గమ్మా.. సల్లంగా చూడమ్మా..!
– అమ్మవారిని పూజించిన శంకర్ యాదవ్
– సతీ సమేతంగా అమ్మవారి దర్శనం
– భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా దుర్గమ్మా.. అందరిని సల్లంగా చూడమ్మా అంటూ తాండూరుకు చెందిన ప్రముఖు రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ అమ్మవారిని వేడుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళ, కుటుంభ సభ్యులు, మిత్ర బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆరవ రోజు మంగళవారం మండపలంలో కొలువు దీరిన అమ్మవారికి వేదపండితుల మంత్రోచ్చరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకుని వేడుకున్నారు. అనంతరం తన సొంత ఖర్చులతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మనోహర్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, జొన్నల వినోద్, మధుసూధన్ రెడ్డి, ఉత్సవ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..!