భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..!
– ప్రతి రోజు దుర్గామాతకు పూజలు
– వాసుపవార్ ఆధ్వర్యంలో పోటీలు
– విజేతలకు ప్రోత్సహాక బహుముతులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండా ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం భూకైలాస్‌లో శరన్నవరాత్రుల శోభ సంతరించుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా దేవాలయం వద్ద దుర్గామాతను ప్రతిష్టించారు. ఆలయ వ్యవవస్థాపకులు వాసుపవార్‌ నాయక్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాసు పవర్ నాయక్ దంపతులు ఇందిరా పవార్, శాంతి పవార్, కుటుంబ సభ్యులు అందరిని సల్లంగా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా వాసుపవార్ నాయక్ తన సొంత ఖర్చులతో తండావాసులకు, వృద్దులకు కొత్త దుస్తులను అందజేశారు.

అంతే కాకుండా ప్రతిరోజు రాత్రివేళ అమ్మవారి పూజ అనంతరం మహిళలకు పురుషులకు వేరువేరుగా ఆటపాటలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలలో పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రోత్సహిస్తున్నారు. భూకైలాస్ దేవాలయంలో రాత్రివేళ భక్తులతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి యువకులు దుర్గామాత వద్ద నిర్వహించే పోటీలకు పెద్ద ఎత్తున తరలువచ్చు పాల్గొని బహుమతులు పొందుతున్నారు.

ప్రతి సంవత్సరం లాగే దుర్గామాత వద్ద సాంప్రదాయ బద్దంగా ఉత్సవాలు నిర్వహించడంతో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. వాసుపవార్ నాయక్ మాట్లాడుతూ పండగతో పాటు సామాజిక సేవా, క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత