పేదలకు బియ్యం ఫ్రీ..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పేదలకు బియ్యం ఫ్రీ..!
– 2028 వరకు పంపిణీ పొడగింపు
– నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
దర్శిని ప్రతినిధి : దేశంలోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద 2024 జులై నుంచి పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీని పొడగించింది. 2028 డిసెంబరు వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఫోర్టిఫైడ్‌ బియ్యం ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా పేదలకు ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్‌ బి-12 పోషకాలు అందిస్తారు. కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీని కొనసాగిస్తోంది. తాజాగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని పొడగించడం పట్ల పేదలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

ఒకే ఒక్కడు..!