బాప్‌రే.. బల్దియా..!
– కార్యాలయంలో ఎన్ని అక్రమాలో..?
– అవినీతిపై వెలువెత్తుతన్న విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ కార్యాలయాలు అంటే అవినీతికి అడ్డాలు అని చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు. ప్రతి శాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులలో అవినీతి పేరుకుపోయిందని విమర్శిస్తుంటారు. పాపం పండి అడ్డంగా దొరికినప్పుడు ఆయా శాఖల అక్రమాలపై చాలా చర్చలు జరుగుతాయి.

ఇప్పుడు వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువలు బహిర్గతం అవుతున్నాయి. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సీనీయర్ అసిస్టెంట్ రమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్యాలయంలో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మున్సిపల్‌లో పనిచేసిన కమీషనర్ అభివృద్ధి పనులపై తప్పుడు బిల్లులు పెట్టి నిధులు కాజేసాశారని తాండూరుకు చెందిన మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివస్ రెడ్డి ఏసీబీ, లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి కమీషనర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల కింద తాండూరు పట్టణంలోని ఓ వ్యాపార వాణిజ్య భవనానికి ఆస్తి పన్నులు కుధించి భారీగా డబ్బులు తీసుకున్నట్లు రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మున్సిపల్‌లోని ఇంజనీరింగ్ అధికారులు జేసీబీని మాయం చేస.. ప్రైవేటు జేసీబీతో పనులు చేయించి.. బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పట్టణంలో మాంసం వ్యర్థాల సేకరణలో నిబంధనలకు విరుద్దంగా వేలం వేసి ఆధాయం రాకుడా చేసినట్లు పుకార్లు ఉన్నాయి.

మున్సిపల్ కార్యాలయంలోని భారీ జాతీయ జెండా విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కార్యాలయం వెనుక భాగంలో ఉన్న చెట్లను అనుమతులు లేకుండా నరికి విక్రయాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పట్టణంలోని విద్యావేత్తకు చెందిన భూమి విషయంలో అధికారులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. వారికి చెందిన 15 ఏళ్ల క్రింద నిర్మించిన భవన నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయంటూ సోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
దాడులతో ఉలికిపాటు
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అధికార యంత్రాంగం ఉలికి పడింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయా విభాగాలలో అధికారులు కూడా భారీగా అవినీతికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో కార్యాలయంలో ఖాళీ అయిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే అధికారులు సాయంత్రానికి వెళ్లిపోవడం గమనార్హం.

ఇదికూడా చదవండి…

