చూడ ముచ్చట..!
– ఎమ్మెల్యేతో కలిసొచ్చిన ఎమ్మెల్సీ వర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 20 వ వార్డులలో చూడ ముచ్చటైన వాతావరణం నెలకొంది. మంగళవారం రెండో రోజు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వార్డులో గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు చేపట్టిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ ఫర్సన్ స్వప్నతో పాటు, ఎమ్మెల్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు, నేతలు దూరంగా ఉండిపోయారు. సోమవారం రాత్రి
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మద్య చోటు చేసుకున్నపరిణామాలతో మంగళవారం పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ వర్గం నాయకులు ఎమ్మెల్యే చేపట్టిన గల్లి గల్లికి పైలెట్ పేరుతో చేపట్టిన కార్యక్రమం పేరును మార్చాలని కోరడంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కార్యక్రమాన్ని గల్లి గల్లికి ఎమ్మెల్యేగా మార్పు చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరడంతో మంగళవారం ఎమ్మెల్సీ వర్గం నాయకులు గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. 20వ వార్డులో కొనసాగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి, యువనాయకులు బిర్కడ్ రఘు తదితరులు ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొనడంతో చూడముచ్చటైన వాతావరణం నెలకొంది.
