మహిళ దారుణ హత్య
– మద్యం మత్తులో భర్త ఘాతుకం
– పోలీసుల అదుపులో హతుడు…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుటుంబ కలహాల నేపథ్యంతో మహిళను ఓ నిందితుడు కొట్టి చంపాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు యాలాల మండలం కమాల్‌పూర్‌కు చెందిన సూజాతకు 8ఏండ్ల క్రితం వివాహము జరిగింది. భర్తతో కలిసి గుజరాత్‌కు వెళ్లింది. అయితే సుజాతకు కమాల్ పూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో అనుబంధం ఉంది. కొన్నాళ్ల క్రితం సుజాత భర్తను వదిలిరావడంతో ఆమెను శ్రీకాంత్ రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్‌కు కూడా గతంలో పెళ్లి జరిగింది. సుజాతతో పాటు శ్రీకాంతుకు కూడా ఇది రెండో పెళ్లి.
పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరి మధ్య కుటుంబ కలహాలతో వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ సుజాతను కర్రతో కొట్టాడు. దీంతో సుజాత ఇంట్లోనే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు శ్రీకాంత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

