మున్సిపల్ శాఖలో కొలువులు…!
– త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటీఫికేషన
– ఎంపిక విధానం, అర్హతలు ఏమిటంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో కొలువులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తికి నోటీపికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతోంది. మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులతోపాటు చాలా రకాల ఉద్యోగాలను భర్తి చేయనున్నారు. త్వరలో తెలంగాణా ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది.
భర్తి చేసే ఉద్యోగాలు ఇవే..
గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్స్ : 07 పోస్టులు, గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్లు : 43 పోస్టులు, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లు : 41 పోస్టులు, హెల్త్ ఆఫీసర్స్ : 07 పోస్టులు, రెవెన్యూ మేనేజర్స్ : 11 పోస్టులు, శానిటరీ సుపర్వైసోర్స్ : 10 పోస్టులు, శానిటరీ ఇన్స్పెక్టర్ : 86 పోస్టులు, హెల్త్ అసిస్టెంట్స్ : 96 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ : 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పరీక్ష పెట్టి, తర్వాత అదే జిల్లాలో పోస్టింగ్ కూడా ఇస్తారు. ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి రూ. 45,000/- వరకు వేతనాలు, ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ కల్పిస్తారు.
అర్హతలు ఏమిటంటే..
మున్సిపల్ శాఖలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. తెలంగాణా జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ పోస్టులకు సంబందించి నోటిఫికేషన్ మరి కొద్ది రోజులలో విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయి.
ఇదికూడా చదవండి…

