రైతుల సేవలో పదవికి వన్నె తేవాలి
– కోట్‌పల్లి ఏఎంసీ చైర్మన్‌కు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సూచనలు
– మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉప్పరి మహేందర్
పెద్దేముల్/వికారాబాద్, దర్శిని ప్రతినిధి: రైతులకు మెరుగైన సేవలతో అందివచ్చిన పదవికి వన్నె తీసుకరావాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్‌లు కోట్‌పల్లి మార్కెట్ కమిటి కొత్త చైర్మన్ ఉప్పరి మహేందర్‌కు సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ కారుడుకు గుర్తింపు పొందిన ఉప్పరి మహేందర్‌ను ప్రభుత్వ ఆదేశాలతో కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్‌గా నియమించారు. ఇందుకు ఉప్పరి మహేందర్ హర్షం వ్యక్తం చేశారు.
తనను గుర్తించి మార్కెట్ కమిటి పదవిని అందించడం పట్ల ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, డా.మెతుకు ఆనంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అందరితో కలిసి ఐక్యంగా పనిచేసి రైతులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కోటపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, ఇందొల్ సర్పంచ్ రాంచందర్, సీనియర్ నాయకులు ఓగులపురం రాజు, బసిరెడ్డి తదితరులు ఉన్నారు.
