గణనాథుల సేవలో శీనన్న..!
– కరణ్ కోట్లో వినాయకులకు పూజలు
– అన్నదానం చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించిన ఉత్సవ సమితి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో ప్రతిష్టించిన గణనాథుల సేవలలో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తరించారు. మండలంలోని కరణ్ కోట్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీనివాస్ రెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తో కలిసి కరణ్ కోట్ గ్రామంలో ప్రతిష్టించిన వినాయకులను దర్శించుకున్నారు. పలు మండపాల వద్దకు చేరుకుని వినాయకులకు పూజలు నిర్వహించారు.
అనంతరం మండపాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నిమజ్జన ఉత్సవాలను కూడా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అంతకుముందు ఉత్సవ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు జే. నాగప్ప, కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి. మాజీ ఎంపీటీసీలు రాజ్ కుమార్, రఘునాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

