కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం
– దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
– ఖండించిన ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడడం బాధాకరమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడికి పాల్పడిన ఘటనను ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే అధికారులకు దాడులకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవడమే మంచిపద్దతని అన్నారు.

అలా కాకుండా అధికారులకు దాడులకు పాల్పడడం సంస్కృతి కాదని అభిప్రాయ పడ్డారు. చెప్పుడు మాటలు విని, అపోహలకు గురై దాడులను జరుపరాదన్నారు. ఫార్మా కంపెనీపై విముఖత ఉంటే ప్రభుత్వం చర్చించుకుని తిరస్కరించుకోవాలన్నారు. అదేవిధంగా అధికారులు, ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదికూడా చదవండి…

లగచర్లోళ్లు.. లగెత్తించారు..!