ఎమ్మెల్యే గారు.. బీసీ సమీకృత భవన్ ఏది..?

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే గారు.. బీసీ సమీకృత భవన్ ఏది..?
– ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన‌ హామిని నిలబెట్టుకోవాలి
– బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఎమ్మెల్యే గారు బీసీ స‌మీకృత భ‌వ‌న్ ఏది అని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ రాజ్ కుమార్ కందుకూరి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శ్నించారు. గత ఎన్నికలతో పాటు ఎన్నికల తరువాత బీసీ స‌మీకృత భ‌వ‌న్‌పై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 2020 సంవ‌త్స‌రం నవంబర్ 6న తాండూర్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో బీసీ కులాలకు చెందిన ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి చేయ‌గా తాండూరులో బీసీ ప్రజల కొరకు సమీకృత బిసి భవన్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అది కూడ ఏడాదిలోగా నిర్మిస్తామ‌న్నార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా వెంటనే బీసీ స‌మీకృత‌ భవన్ నిర్మాణంకు అవసరం అయిన భూమిని గుర్తించడంతో పాటు నిధులను కేటాయించి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో అధిక శాతంలో ఉన్న బీసీలకు బీసీ విద్యార్థులకు బిసి భవన్ ఏర్పాటు చేయడం వల్ల లాభం చేకూరే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల యువకుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అన్నారు.