బల్దియాలో సర్వర్ డౌన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బల్దియాలో సర్వర్ డౌన్..!
– కుటుంబ సర్వే ఎంట్రికి చిక్కులు
– నెట్ రాక ఇబ్బందులు పడ్డ ఎన్యూమరేటర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో సమగ్ర కుటుంబ ఆర్థిక సర్వే ఎంట్రికి చిక్కులు ఏర్పడ్డాయి. గతనెల తాండూరు మున్సిపల్ లోని 36 వార్డుల్లో ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు సర్వే చేపట్టారు. ఇటీవలే సర్వే వివరాలను ఆన్ లైన్లో ఎంట్రీ చేసే పనులు చేస్తున్నారు. పట్టణంలో దాదాపు 20వేల కుటుంబాల వివరాలను సేకరించారు. ఈ వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్ లైన్లో ఎంటర్ చేస్తున్నారు. ఎంట్రీ కోసం మున్సిపల్ లో సుమారు 20 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.

అయితే గత రెండు రోజుల నుంచి మున్సిపల్ లో ఇంటర్నెట్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కార్యాలయంలో ఇంటర్ నెట్ సర్వర్ పూర్తిగా డౌన్ అయ్యింది. ఉదయం నుంచి ఎంట్రీ చేసేందుకు వచ్చిన ఎన్యూమరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సర్వర్ లేక ఇబ్బందులు పడ్డారు. ఇంటర్ నెట్ అంతరాయం వల్ల మున్సిపల్ లో ఇప్పటి వరకు 30 శాతం కన్న తక్కువగా ఎంట్రీ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పట్టణంలో కుల సర్వే ఎంట్రీ మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి…

ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకవాగు సర్వే