ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకవాగు సర్వే
– మురుగు శుభ్రతకు కూడా చర్యలు
– కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి ఫిర్యాదుతో కదలిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో చిలుకవాగు సర్వేకు అధికారులు కదిలివచ్చారు. మంగళవారం మున్సిపల్, తహసీల్దార్ అధికారులు ఆదర్శనగర్ లోని చిలుకవాగును సందర్శించారు. అంతకుముందు పట్టణంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చిలుక వాగు పూడికల వల్ల మురుగు సమస్య ఏర్పడుతుందని కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి వివరించారు. వర్షకాలం నుంచి వాగు కాలువలు పూడికలు వేయడం జరిగిందని వివరించారు. దీంతో మురుగు ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు ఆదర్శనగర్ లోని చిలుక వాగు సర్వేకు కదిలారు. ఆదర్శ నగర్ పరిధిలోకి వచ్చే కౌన్సిలర్ విజయాదేవి, బీజేపీ నాయకులు రజనీకాంత్ లతో కలిసి తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, సిబ్బంది చిలుక వాగు పూడిక ప్రాంతాన్ని పరిశీలించారు. మురుగు కాలువ ప్రవాహాన్ని పరిశీలించారు. చిలుక వాగు నీరు సాఫీగా సాగేలా పూడిక తీసే పనులు చేయిస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు చిలుక వాగు పూర్వపు పద్దతిలో కాలువ ఉండే లా సర్వే చేయిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్, అధికారులు సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

