అయ్యో.. శివ..శివ..!
– ఒక్కరైనా పాపం అనలేరా
– జిల్లా ఆసుపత్రిలో రోగి చిత్రవధ
– ఆధార్ కార్డు లేదని చికిత్సకు దూరం
– ఆదుకోవాలని బాధితుడి మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి : పనిమీద ఊరు కాని ఊరు వచ్చాడు. పొట్టకూటి కోసం దొరికిన పని చేసుకుంటూ ఉన్నదాంట్లో సరిపెట్టుకుంటున్న అతనిపై కాలం పగబట్టేదేమో. కాలికి చిన్న దురద వ్యాధి సోకి.. ప్రమాదకరంగా మారింది. చికిత్స కోసం వెళితే.. ఆధార్ కార్డులేకపోవడంతో వైద్యం అందించడం లేదని బాధితుడు ఆవేధన చెందుతున్న తీరు అయ్యో పాపం అనిపిస్తుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చితాపూర్‌కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి గత కొన్ని నెలల క్రితం తాండూరులో పనిచేసుకునేందుకు వలస వచ్చాడు.
దొరికిన పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఎడమ కాలికి దురద వ్యాధి సోకింది. రోజు రోజుకు అది ఇన్ఫెక్షన్‌గా మారింది. చికిత్స కోసం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి వెళితే.. ఆధార్ కార్డు అడిగారని చెప్పాడు. తనవద్ద లేదని చెప్పడంతో వైద్యం అందించలేదని వాపోయాడు. దీంతో 20 రోజులుగా శివకుమార్ ఆసుపత్రి వద్దే పడిఉన్నాడు. ఇనుఫెక్షన్ సోకిన కాలుకు మొత్తం పురుగులు పడి చిత్రవధ అనుభవిస్తున్నాడు. ఎవరైనా స్పందించి తనకు వైద్యం అందించేలా చూడాలని మొరపెట్టుకుంటున్నాడు. అతని పరిస్థితిని చూసిన వారంతా అయ్యే పాపం అని సానుభూతి తెలుపుతున్నారే తప్ప సాయానికి ముందుకు రావడం లేదు.
ఇదికూడా చదవండి…

