శాస్త్రవేత్త డా.సి. సుధాకర్‌కు కిసాన్ సేవారత్న అవార్డు

తాండూరు మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్

శాస్త్రవేత్త డా.సి. సుధాకర్‌కు కిసాన్ సేవారత్న అవార్డు
– రేపు వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా ప్రధానోత్సవం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా.సి. సుధాకర్‌కు కిసాన్ సేవారత్న అవార్డు వరించింది. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుస్థిర వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గాను డా.సి. సుధాకర్ ను గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ‌ కిసాన్ సేవారత్న అవార్డు 2022కు ఎంపిక చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పద్మావతి శ్రీనివాస గార్డెన్లో నిర్వహిస్తున్న సుస్థిర వ్యవసాయ రాష్ట్ర స్థాయి రైతు చైతన్య సదస్సు వేదికలో డా.సి. సుధాకర్‌కు ఈ అవార్డును అందించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరవుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరుగుతుందని అవార్డు గ్రహీత డా.సి. సుధాకర్ తెలిపారు. మరోవైపు శాస్త్రవేత్త డా. సి. సుధాకర్ కిసాన్ సేవారత్న అవార్డుకు ఎంపిక కావడంపట్ల పలువురు అభినందనలు తెలిపారు.