మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్
– ఇందిరా మహిళ శక్తి కింద స్వయం ఉపాధి కేంద్రాల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో ఇందిరా మహిళ శక్తి పథకం కింద మహిళలకు ఆర్థిక ప్రోత్సహం అందించింది. ఈ నిధులతో నాలుగు యూనిట్ల కింద ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి కేంద్రాలను మంగళవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను స్వయం ఉపాధిలో ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా తాండూరులోని మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యూటీ పార్లర్, బేకరీ, ఎంబ్రాయిడరీ, ఎంపోరియం కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. వారి వారి నైపుణ్యాలతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోమశేఖర్, విజయదేవి, రాము, ఐకేపీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలి