ఉర్సు ఉత్స‌వాల‌లో మ‌త సామ‌ర‌స్య‌త

తాండూరు వికారాబాద్

ఉర్సు ఉత్స‌వాల‌లో మ‌త సామ‌ర‌స్య‌త
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ముస్లిం సోద‌రులు ప‌విత్రంగా నిర్వ‌హించే ఉర్సు ఉత్స‌వాల‌లో మ‌త సామ‌ర‌స్య‌త వెల్లి విరుస్తోంద‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. బుధ‌వారం ఆమె మున్సిప‌ల్ ప‌రిధి గొల్ల‌చెరువు క‌ట్ట‌పై వెల‌సిన ద‌ర్గాలో నిర్వ‌హించిన ఉర్సు ఉత్స‌వాల‌లో పాల్గొన్నారు. ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు
నిర్వ‌హించి మొక్కులు తీర్చుకున్నారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ఉర్సు ఉత్స‌వాలు ఎంతో ప్ర‌త్యేక‌మైనవి.. ప‌విత్ర‌మైన‌వ‌న్నారు. ఇలాంటి ఉత్స‌వాల‌లో అంద‌రు పాల్గొంటార‌ని, ఐక్య‌త చాటుకుంటూ మ‌త సామ‌స్య‌త‌ను నిలుపు కోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు మంకాల రాఘ‌వేంద‌ర్, రాము, యువ‌నాయ‌కులు చంటి యాద‌వ్, ఎర్రం శ్రీ‌ద‌ర్, సంజీవ‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.