మార్మోగిన శరణు గోష..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్మోగిన శరణు గోష..!
– వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ
– పూజలో పాల్గొన్న పట్నం రినీష్ రెడ్డి
– దర్శించుకున్న చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
– మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం శరణు గోషతో మార్మోగింది. బుధవారం తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల తనయుడు పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా జరిగింది. పూజలో రినీష్ రెడ్డి అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పడిపూజలో అయ్యప్ప స్వాముల కీర్తనలతో, భజనలతో ఆలయం శరణు గోషతో మార్మోగింది. పూజ అనంతరం రినీష్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, కూతురు మనీషా రెడ్డి, అల్లుడు హిమదీప్ రెడ్డిలు అయ్యప్ప స్వాములకు సద్ది సేవ చేసుకున్నారు.

అయ్యప్ప స్వాములు, భక్తులతో ఆలయం కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ జెడ్పీటీసీలు రాకేష్ మహరాజ్, సిద్రాల శ్రీనివాస్, మహిళ నాయకురాలు నర్మదాదేవి, కౌన్సిలర్లు శోభారాణి, ప్రవీణ్ గౌడ్, రాము, బోయరవి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండలాల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు